గిరిజనేతరుల అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరైన జనసేన నాయకులు

  • అఖిలపక్ష సమావేశానికి హాజరైన సాయిబాబా దురియా (మాజీ ఎంపీటీసీ), కార్యనిర్వాన కమిటీ సభ్యులు సురేష్, రాజు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, హుకుంపేట మండల కేంద్రంలో గిరిజ నేతరుల అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా మరియు 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని ఆదివారం హుకుంపేట మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగినది.. ఈ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, కార్యనిర్వాహన కమిటీ సభ్యుడు (అల్లూరి జిల్లా) సురేష్, రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనేతరుల అక్రమ కట్టడాలను కూల్చి చేయాలని, అక్రమంగా ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా కట్టడాలు చేపట్టి ఉన్నారో వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజను హక్కులను, చట్టాలను తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. గిరిజనేతరుల అక్రమ కట్టడాలపై వైసిపి ప్రభుత్వం వైఖరి ఎంటో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని తెలిపారు.