రైల్వే సమాచారమంతా ఇక ‘139’తోనే!

ఇక పై సమస్త రైల్వే సమాచారాన్ని ఒకే నంబర్ తో తెలుసుకునే సదుపాయం రైల్వేశాఖ  కల్పిస్తుంది. ప్రస్తుతం రైలు ప్రయాణికుల సౌకర్యార్థం కొనసాగుతున్న సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ 182ను తొలగించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ ను 139లో విలీనం చేశామని పేర్కొంది. ఒకే నంబర్ ఉండటం వల్ల ప్రయాణికులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని, రైళ్ల సమాచారంతో పాటు సమస్యలపై ఫిర్యాదు చేయడం కూడా సులభతరం అవుతుందని రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.