ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసైనికులందరు సిద్ధం కావాలి: వంగ లక్ష్మణ్ గౌడ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణి కార్యక్రమం జూన్ 12 ఆదివారం జరగనున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నాయకులు, యువజన, విద్యార్థి విభాగం నాయకులు మరియు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులందరు పెద్ద ఎత్తున నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వంగ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయం వద్దకు విచ్చేసి, క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.