రాక్షస పాలన అంతముందించేందుకు జనమంతా ఏకమవుతున్నారు

తాడేపల్లిగూడెం: బి కొండెపాడు నుంచి వైసీపీ నుంచి భారీగా జనసేనలో చేరికల సందర్భంగా మాట్లాడిన బొలిశెట్టి రాష్ట్రంలో జగనాసురుడు రాక్షస పాలన అంతముందించేందుకు జనమంత ఏకమవుతున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం, బి కొండేపాడు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ వి కట్ట దానయ్య, మాజీ ఎంపీపీ కట్ట పద్మావతిలతోపాటు వారి అనుచరులు ఆ గ్రామానికి చెందిన నెంబర్లు నాయకులు కార్యకర్తలు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట దానయ్య మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన తమకు నిధులు, విధులు లేకుండా జగన్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఆ పాలనకు చరమగీతం పాడేందుకు వైసీపీ నుంచి జనసేనలోకి చేరుతున్నామన్నారు. అనంతరం జనసేన యువనాయకుల బులిసెట్టి రాజేష్ జనసేన పార్టీలోకి చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీలో పనిచేసిన వారందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తామని, ప్రజా సమస్యల పరిష్కరించడమే మనలక్ష్యం కావాలని కోరారు.