ఆశాజ్యోతి అనాథాశ్రమంలో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు

పార్వతీపురం, ఇండియన్ స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు శనివారం పార్వతీపురం పట్టణంలోని ఆశాజ్యోతి అనాధాశ్రమంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యువ మెగా ఫ్యామిలీ సేవా సంఘం, అల్లు అర్జున్ ఆర్మీ ఆధ్వర్యంలో పిల్లలకు స్వీట్లు పంచి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువమేగా ఫ్యామిలీ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదానం, అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో యువ మెగా ఫ్యామిలీ సేవా సంఘం అధ్యక్షులు రాజాన రాంబాబు, అల్లు అర్జున్ ఆర్మీ ప్రెసిడెంట్ బలంకి శంకర్, గొర్లి చంటి, గౌరీ, చైతు, రాజేష్, అల్లు అర్జున్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.