అమలాపురం వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నాదెండ్ల

అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామంలో భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పరిశీలించి రైతులతో, రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, అమలాపురం ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ పంతం నానాజీ, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు పాల్గొన్నారు.