పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కు కారణం వై.సి.పి అసమర్థతే: బాడిశ మురళీకృష్ణ

జగ్గయ్యపేట నియోజకవర్గం: పదవ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజ్ ఖచ్చితంగా వై. సీ. పి ప్రభుత్వం అసమర్థత వల్లే జరిగిందని దీని మీద విద్యాశాఖ పూర్తి స్థాయిలో విఫలం అయ్యిందని జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ పత్రికా ముఖంగా విమర్శలు కురిపించారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస జాగ్రత్తలు పాటించకుండా పరీక్షలు నిర్వహించడం దురదృష్టకరమని, పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రాలు బయటకు రావడం ప్రశ్న ప్రత్రాల లీకేజ్ లను నియంత్రించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయిందని, మొదటిరోజు తెలుగు ప్రశ్న పత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టిందని, రెండో రోజు హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చేసిందని, విద్యార్థుల పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అవకాశమేలేదు పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు సిబ్బంది సెల్ ఫోన్లు తీసుకెళ్ళవద్దని చెప్పామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ఈ లీకేజ్ విషయంలో విద్యాశాఖ దగ్గర సమాధానం లేదు. పైగా ఇదేదో మాస్ కాపీయింగ్ అంటూ, ప్రశ్నాపత్రం లీక్ అంటూ సమర్ధించుకునే లా వ్యవహరిస్తుందని విద్యార్థుల భవిష్యత్తు ని ఏ మాత్రం కూడా దృష్టిలో లేకుండా వ్యవహారిస్తే మీకు ప్రజలు తగిన బుద్ది చెప్తారని బాడిశ మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.