అమలాపురం పట్టణ జనసేన అధ్యక్షుడు పిండి సాయిబాబా హఠాన్మరణం!

అమలాపురం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు పిండి సాయిబాబా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఇంటివద్ద తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, పట్టణ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గత మూడు సంవత్సరాలుగా అమలాపురం పట్టణ అధ్యక్షులుగా పార్టీకి విశేష సేవలందించిన పిండి సాయిబాబా అకాల మరణం బాధాకరం. జనసేన పార్టీ తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.