రైతు బరోసా యాత్ర గోడ పత్రులను ఆవిష్కరించిన అమరాపురం జనసేన

అమరాపురం మండలం.. అనంతపురం అర్బన్ ఇంచార్జీ మరియు జిల్లా అధ్యక్షులు టీసీ.వరుణ్ ఆదేశాల మేరకు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు బరోసా యాత్రను క్షేత్ర స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లేందుకు బుధవారం అమరాపురం మండలంలోని స్థానిక మెయిన్ బజార్ ఆవరణలో మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి రఫీక్, నాయకులు తిమ్మరాజు, లింగరాజు రైతు బరోసా యాత్ర పోస్టర్లను ఆవిష్కరించి.. అనంతరం వివిధ చోట్ల గోడ పత్రికలను అతికించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పడుతున్న తపన కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన రైతు బరోసా యాత్ర మరియు కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రియశీలక సభ్యత్వం 5లక్షల ప్రమాద భీమా కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా.. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ధ్యేయంగా పనిచేయాలని నాయకులకు మరియు జనసైనికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.