బెండపూడి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

తుని, అంబేద్కర్ జయంతి సందర్భంగా బెండపూడి గ్రామంలో జైభీమ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలు జనసేన పార్టీ తొండంగి మండల అధ్యక్షులు నాయుడు, జనసేన పార్టీ బెండపూడి గ్రామ అధ్యక్షులు కోరుకొండ శివ, తుని ఐటి కోఆర్డినేటర్ భూసాల మణిబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని గుర్తు చేశారు. జనసేన గ్రామ కమిటీ సభ్యులు పెంకేమనికంట సోమిశెట్టి శివ కుమార్, ఎర్ర ప్రణీత్, సోమేశ్వరరావు తదితరులు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.