భారతదేశ అభ్యున్నతికి అంబేద్కర్ సేవలు అజరామరమైనవి: వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సేవా సమితి గుంతకల్ పట్టణం, బెంచికొట్టాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గుంతకల్ నియోజకవర్గం నిరసన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట వాసగిరి మణికంఠ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, తర్వాత మెగా రక్తదాన శిబిరంలో తానే స్వయంగా రక్తదానం చేసి తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు తన అద్భుతమైన ప్రతిభతో భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి, భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి కారణమైన మహనీయుడు, అనగారిన వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అజరామరమైనవి. ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కొనసాగించాలని, ఆయన రాజ్యాంగం ద్వారా అందించిన విలువలను కాపాడుకుంటే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలా కాకుండా పదవులు ఉన్నాయనే అహంకారంతో రాజకీయ నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం. స్వాతంత్రం కోసం మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేశారు. వారి పోరాటాల స్ఫూర్తిని భావితరాల్లో నింపాలి అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, కృష్ణ, మంజునాథ్, పామయ్య, ధనుంజయ, శేఖర్, రమేష్ రాజ్, సుబ్బయ్య, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, కొనకొండ్ల శివ, రమేష్ రాజ్, పర్శ, సూరి, కథల వీధి అంజి, సందీప్, అల్లు రవి, అనిల్ కుమార్, రామకృష్ణ(పుష్ప )పెద్ద ఎత్తున అంబేద్కర్ యువజన సేవా సమితి సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, నిస్వార్థ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.