కరోనా రక్కసిని జయించిన అమిత్ షా

హోంమంత్రి అమిత్ షా రెండు వారాల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు శుక్రవారం COVID-19 పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్ వచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా తెలిపారు. దాదాపు రెండు వారాల తరువాత హోంమంత్రి స్వయంగా తన కరోనా పరీక్ష ఫలితాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ రోజు నా కరోనా పరీక్ష రిపోర్ట్ నెగిటివ్‌గా వచ్చింది. దేవునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులు ఇంట్లో క్వారంటైన్ లో ఉండనున్నాను’’ అని ఆయన ట్విట్ చేసి వెల్లడించారు.