మంత్రులతో అమిత్‌ షా భేటీ

కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో కొనసాగుతున్న రైతుల ఆందోళనపై హోంమంత్రి అమిత్‌ షా గురువారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పియూష్‌ గోయెల్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌తో చర్చించారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పార్టీ నేతలు సి.టి.రవి, దుష్యంత్‌ గౌతమ్‌, అరుణ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో కొత్త సాగు చట్టాలపై వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ పరంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సభల విషయమై కూడా చర్చించారు. ఎందుకోసం ఉద్యమిస్తున్నామో చాలా మంది రైతులకు తెలియకపోవడం బాధిస్తోందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ వ్యాఖ్యానించారు.