అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ మజ్జిగ చలివేంద్రం 52వ రోజు

పాలకొల్లు నియోజకవర్గం: పాలకొల్లు చరిత్రలోనే ఎన్నడూ ఎవ్వరూ నిర్వహించని విధానంగా అమ్మ నాన్న, పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మండు వేసవి ఎండలో ప్రయాణించే ప్రయాణికులకు, వాహనదారులకు దాహాన్ని తీర్చేందుకు గత 51 రోజులుగా సుమారు 25,000 మందికి బట్టర్ మిల్క్ అందజేయడం జరుగుతుంది. 52వ రోజైన బుధవారం కూడా ఈ కార్యక్రమాన్ని విజవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నం శెట్టి గోవర్ధన్, అనంతపల్లి సతీష్, గమ్మిడి మహేష్, పామర్తి బాలు, కోలా కుమార్, బల్లెం రాజేష్, భోగేందర్, హరి తదితరులు పాల్గొన్నారు..