Guntkal: జనసేనానికి పాలాభిషేకం

అనంతపురంజిల్లా, గుంతకల్లు నియోజకవర్గం కాలగర్భంలో కలిసిపోయిన దళిత మాణిక్యం, మహనీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారిని పైకి తీసి ఆయన గొప్పతనాన్ని సమాజానికి మరోసారి చాటి చెబుతూ ఆయన ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి1₹ రూపాయలు విరాళం ప్రకటించడమే కాక ఆయన పేరును ఆయన పుట్టిన కర్నూలు జిల్లాకు పెట్టాలని తద్వారా దామోదర సంజీవయ్య జిల్లాగా మార్పు చేయాలని జనసేన అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ డిమాండును హర్షిస్తూ రాష్ట్రంలోని దళితులందరి ఆత్మగౌరవం కోసం నిలబడిన శ్రీ పవన్ కళ్యాణ్ కి యావత్ దళిత జాతి ఋణపడి ఉంటుందని తెలియజేస్తూ జనసేనపార్టీ బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ కి మరియు ప్రముఖ దళిత నాయకులు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అనంతపురం జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి శ్రీ వాసగిరి మణికంఠ మాట్లాడుతూ శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఎంతో నీతి, నిజాయితీతో జీవించారు ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత వారి మాతృశ్రీ కి ఖర్చులుకు గాను 100₹ రూపాయలు ఇస్తే, ఆ పుణ్యస్త్రీ ఊర్లో, రాష్ట్రంలో ఉన్న తల్లులందరికీ ఎవరు 100₹ రూపాయలు ఇస్తారు అని చెబితే ఆ క్షణంలో మెదిలిన ఆలోచనే వృద్ధాప్య పెన్షన్ పథకం, ఆయన రెండు సంవత్సరాల పరిపాలనా కాలంలో 6 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని బడుగు బలహీన వర్గాల వారికి పంపిణీ చేసిన దార్శనికుడు మరియు వంశధార, వరదరాజుల, గాజులదిన్నె, పులిచింతల ప్రాజెక్టుల సృష్టికర్త, ప్రతి జిల్లాలోనూ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసిన ప్రథముడు శ్రీ దామోదరం సంజీవయ్య వారి స్ఫూర్తితో భవిష్యత్తు ప్రజా ప్రభుత్వంలో పేదలను పరిపాలకులుగా చేయాలన్నా పవన్ కళ్యాణ్ సంకల్పం నెరవేరాలని ప్రజలందరూ ఇటువంటి నాయకుడిని బలపరచాలని పేర్కొన్నారు.