ఆహా వేదికగా ‘అండ్ ది ఆస్కార్ గోస్ టు..’
గత ఏడాది మలయాళంలో విడుదలైన ‘అండ్ ది ఆస్కార్ గో టు’ ఈ చిత్రాన్ని ఇప్పుడు ‘ఆహా’ ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. సినిమానే ప్రపంచంగా బతికే ఒక యువకుడు ఆస్కార్ అందుకునే స్థాయికి ఎలా చేరుకున్నాడు? సినిమా తీయడానికి అతను పడిన కష్టాలేంటి? ఆస్కార్ స్థాయి సినిమా తీస్తానన్నప్పుడు అతనికి ఎదురైన అవమానాలు, అవహేళనలు అధిగమించి అవార్డు ఎలా అందుకున్నాడన్నది ఈ చిత్ర కథ. భావోద్వేగ సన్నివేశాలతో పాటు, చక్కటి ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఆగస్టు 28వ తేదీ నుంచి ఆహా ఓటీటీ వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది.