ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలలో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

విజయనగరం: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా క్వీన్ ఎన్.అర్. ఐ. హాస్పిటల్ విజయనగరం వారి ఆధ్వర్యంలో హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం నడక ర్యాలీని శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ నడక ర్యాలీలో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కోట వద్దనుండి మెయిన్ రోడ్, గంటస్థంభం మీదుగా ఎస్.బి.ఐ. మెయిన్ బ్రాంచ్ వద్దనున్న ఎన్.అర్. ఐ. హాస్పిటల్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో గుండె జబ్బులు మరియు సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కోసం ఎన్.అర్. ఐ. హాస్పిటల్ వారు చేపట్టడం అభినందనీయమని, ఈ అవగాహనా నడక ర్యాలీలో మా వాకర్స్ క్లబ్బులను భాగస్వామ్యం చేయటం ఎంతో మేలు చేకూరుతుందని, సాధారణంగా ఎవరైనా రోజుకు దాదాపు గంటసేపు నడిస్తే.. ఇరువై నాలుగు గంటల పాటు గుండె పదిలంగా ఉంటుందని, అందుకే ప్రజలంతా నడిచి, నడిపిస్తూ ఆరోగ్యంగా సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు సురేష్, రాంజీ, కుమార్, సతీష్, శ్రీను పాల్గొన్నారు.