గోరంట్లలో ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు జనసేన రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవని రవికుమార్ పిలుపు మెరుకు గోరంట్లలో ఘనంగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గోరంట్లలో పేద వృద్ధురాలికి బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అందజేయడం జరిగింది. అలాగే అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత పెనుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి సురేష్, కార్యక్రమాల కమిటీ సభ్యుడు పొగతోట వెంకటేష్, నరేష్, పురుషోత్తం, బాబావలి, రంగనాథ్, నాగేష్, తిరుపల్, శంకర తదితరులు పాల్గొన్నారు.