మధుమేహం పరీక్షలు నిర్వహించిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

విజయనగరం, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలవారీ సేవాకార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం పాత బస్టాండ్ వద్ద రాజీవ్ క్రీడా ప్రాంగణంలో సుమారు వంద మందికి మధుమేహం పరీక్షలను క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్ట్రిక్ట్స్ -102 గవర్నర్ పీజీ గుప్తా హాజరయ్యి మాట్లాడుతూ చేసిన సేవలే గుర్తింపును ఇస్తాయని, సమాజంలో సేవా కార్యక్రమాలతో వాకర్స్ క్లబ్స్ ప్రధాన భూమికను ఫోషిస్తున్నాయని, ప్రతీ ఒక్కరు మధుమేహం పరీక్షలను తరుచూ చేయించుకొని, ఆహారనియమాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ రక్తపరీక్ష నిపుణులు హెమసుందర్, అభి, డిస్ట్రిక్ట్స్-102, క్యాబినెట్ కార్యదర్శి సంజీవరావు, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కార్యదర్శి కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, ఉపాధ్యక్షడు లోపింటి కళ్యాణ్, సభ్యులు పత్రి సాయి, కుమార్ పాల్గొన్నారు.