అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం: గురాన అయ్యలు

విజయనగరం: అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప కార్యక్రమమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. గురువారం పట్టణంలోని తెలకల వీధి, రామమందిరం వద్ద అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనియమన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావం అలవర్చుకొని సమజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు. సనాతన ధర్మాన్ని, మానవత విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. యువకులు మంచి మార్గంలో నడవాలని సూచించారు. వినాయక కమిటీ సభ్యులు వీరికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శివ, పవన్, వినోద్, బాలకృష్ణ, సాయి, జనసైనికులు చక్రవర్తి, వజ్రపు నవీన్ కుమార్, ఎమ్. పవన్ కుమార్, గొల్లపల్లి మహేష్, పృథ్వీ భార్గవ్, సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.