గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురిని పరామర్శించిన గాదె

గుంటూరు: గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ లో మునిసిపల్ నీళ్లు తాగి గత 3 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోవడం అదేవిధంగా దాదాపు 40 మంది హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకొన్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హాస్పిటల్ కి వెళ్లి భాదితులను పరామర్శించటమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, పత్తిపాడు సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, శిఖా బాలు, చింతా శివ, యడ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.