మానసిక విద్యార్థుల సమక్షంలో వార్షికోత్సవ వేడుక
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, ఎంపిటిసిలుగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం స్వీకరించి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా శనివారం కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక విద్యార్థుల సమక్షంలో చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు కేక్ కట్ చేసి వారి ధన సహాయంతో స్వీట్ హాట్ మానసిక విద్యార్థులకు, వృద్ధులకు, అనాధలకు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా దంపతులిద్దరూ మాట్లాడుతూ మమ్మల్ని ఎంపీటీసీగా నెగ్గించిన చిందాడగరువు ప్రజలకు, జనసైనికులకు, పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా వచ్చే 2024 ఎన్నికల్లో సీఎంను చేసేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా తోటి ఎంపీటీసీలకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-24-at-17.46.55-1-1024x518.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-24-at-17.46.55-1024x518.jpeg)