దీనస్థితిలో ఉన్న వ్యక్తి ఆకలి తీర్చిన గుల్లిపల్లి విజయలక్ష్మి

  • తల్లిదండ్రులను చూసుకోలేని బ్రతుకులు ఒక బ్రతుకులేనా?: గుల్లిపల్లి విజయలక్ష్మి

భీమవరం నియోజకవర్గం: వీరవాసరం గ్రామానికి చెందిన ముర్రి అప్పారావు ఒక కుమారుడు, కుమార్తె ఉండగా అతను ఒక అనాధలా స్మశాన వాటిక దగ్గర గత మూడు, నాలుగు నెలల నుండి తిని, తినక దీనస్థితిలో బ్రతుకు జీవిస్తూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న వీరవాసరం ఎంపీటీసీ గుల్లిపల్లి విజయలక్ష్మి వెంటనే స్పందించి ముర్రి అప్పారావు కు అల్పాహారం, పాలు, బ్రెడ్, టిఫిన్ అందించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ రోజుల్లో మన దేశంలో ఎన్నో వృద్ధాశ్రమాలు నెలకొల్పడానికి ముఖ్య కారణం పిల్లలే. తల్లిదండ్రులు తిని తినక పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే చివరికి మనం చేసేది ఏంటి వాళ్లకి ఒక పూట తిండి పెట్టలేని పరిస్థితికి మనం దిగజారిపోయామా.. అసలు ఏం జరుగుతుంది. సమాజంలో చిన్నతనంలో మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మన తల్లిదండ్రులని వృద్ధాప్యంలో వాళ్లు మనకి భారం అయిపోతున్నారు. మనం అభివృద్ధి చెందుతున్నామా, లేక అనాగరికత వైపు అడుగులు వేస్తున్నామా..? కనీసం తల్లిదండ్రులను కూడా చూసుకోలేని మన బ్రతుకులు ఒక బ్రతుకులేనా..? అని విజయలక్ష్మి ప్రశ్నించారు.