ఆచార్యలో మరో స్టార్ హీరోయిన్

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా ఆచార్య కోసం  మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఒక డిఫరెంట్ సోషల్ మెస్సేజ్ సినిమాతో రానున్న మెగాస్టార్ ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ కూడా అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను రూపొందిస్తున్నాడు. కాగా,  సినిమాలో హీరోయిన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఇంతవరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. కాజల్ అగర్వాల్ అని ఆల్ మోస్ట్ ఫిక్స్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర అమెదేనట. స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిరుతో స్టెప్పులు వేసిన అనుష్క ఆ తరువాత సైరా సినిమాలో ఝాన్సీ రాణిగా గెస్ట్ రోల్ చేసింది.

ఇక ఇప్పుడు ఆచార్యలో ఎలాంటి పాత్రలో కనిపిస్తుందో చూడాలి. రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆ పాత్రపై ఇప్పటికే మెగాస్టార్ ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక మెగాస్టార్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్, చిరంజీవి పాత్రలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం దర్శకుడు కొరటాల ఇప్పటికే ఒక షెడ్యూల్ ని రెడీ చేసినట్లు సమాచారం.