డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మరో యువ నటుడు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు అన్ని ఇండస్ట్రీస్‌లో ఇపుడు డ్రగ్స్ వాడకం అనేది సర్వసాధారణ మైపోయింది. ఆ సంగతి పక్కన పెడితే.. కన్నడ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు డ్రగ్స్‌ మత్తులో మునిగిపోయింది. అక్కడ ఈ కేసు రోజుకో  కొత్తమలుపులు తిరుగుతుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒక్కరితో మొదలైన వ్యవహారం ఇండస్ట్రీ మొత్తాన్ని పట్టి పీడిస్తుంది. ఇంకా ఇందులో ఎంతమంది ఉన్నారనేది కూడా అర్థం కావడం లేదు. ఇప్పటికే రాగిణీ ద్వివేది, సంజన గర్లానీతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇంకా అసలు దోషులు మాత్రం బయటకు రావడం లేదనే మాట కూడా వినిపిస్తోంది. కేవలం ఓ మోస్తరు నటీనటులపైనే పోలీసులు, ప్రభుత్వం కేసులు పెడుతున్నాయన్న అభియోగం లేకపోలేదు. తాజాగా ఈ కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ ABCD సినిమాలో డాన్సర్‌గా నటించిన కిషోర్ అమన్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతడితో పాటు అఖీల్ నౌషీలో వ్యక్తిని పోలీసులు అదుపులోకి వారి వద్ద ఉన్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కర్ణాటక పోలీసలు. వీరు ముంబైలో డ్రగ్స్ కొనుగోలు చేసి కర్ణాటకలో విక్రయిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. ద్విచక్ర వాహనంపై వెళతున్న వీళ్లిద్దరిని పోలీసులు వెంబడించి పట్టుకుని వారి వద్ద డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో బెంగుళూరు ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ. 10 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు