అంతర్గాం మండల జనసేన నూతన కమిటీ నియామకం

రామగుండం నియోజకవర్గం: అంతర్గాం మండల జనసేన నూతన కమిటీ నియామకం జరిగిన సందర్భంగా రామగుండం జనసేన ఇంచార్జ్ మూల హరీష్ గౌడ్ నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ పైన నమ్మకంతో మీకు కీలక బాధ్యతలు ఇస్తున్నాను. మీ పైన ఇప్పటినుండి ఇంకా బాధ్యత పేరుగుతున్నందున ప్రతి ఒక్కరు కూడా పార్టీ సిద్ధాంతాల కోసం, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయవలసిందిగా కోరుతూ నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.