సమస్య ఏదైనా సరే 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటా: దల్లి గోవిందరెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64వ వార్డు, గొడ్డువాణిపాలెం గ్రామం ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు,మేరకు చాలా రోజుల నుండి టీ షాప్ పక్కన ఉన్న(గంట్యాడ మెయిన్ రోడ్) కాలవలో చెత్త పేరుకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 64 వ వార్డు కార్పొరేటర్ శ్రీ దల్లి గోవిందరెడ్డి కి తెలియపరిచారు. ఆయన స్పందిస్తూ.. 24 గంటల్లోనే సమస్యను జీవీఎంసీ వారితో మాట్లాడి.. సిబ్బందితో పని పూర్తి చేయించారు. ఆ వీధిలో మహిళలు, కార్పొరేటర్ గోవింద్ రెడ్డికి.. ధన్యవాదాలు తెలుపుతూ… గొడ్డువాణిపాలెం ప్రజలు అభినందించారు. సమస్య చెప్పిన గంటలోనే.. గోవింద రెడ్డి స్పందిస్తున్నారని.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ…. సమస్య ఏదైనా సరే 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటానని… జనసైనికులు కూడా మీకు నిత్యం అందుబాటులో ఉంటారని.. జనసేన పార్టీ ప్రజల వద్దకే పాలన తీసుకొస్తుందని. గ్రామ ప్రజలుతో చెప్పుకొచ్చారు.