ఏపి బిజేపి కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు ..

ఆంధ్ర ప్రదేశ్ బిజేపి కొత్త రాష్ట్ర కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు. 10 మంది ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా విష్ణుకుమార్ రాజు, రేలంగి శ్రీదేవి, విజయలక్ష్మి, నిమ్మల జయరాజు, ఆదినారాయణరెడ్డి, వేణుగోపాల్, రావెల కిశోర్ బాబు, సురేందర్ రెడ్డి, మాలతీరాణి, చంద్రమౌళిలను నియమించారు. అధికార ప్రతినిధులుగా భానుప్రకాశ్ రెడ్డి, పూడి తిరుపతిరావు, సుహాసిని ఆనంద్, సాంబశివరావు, ఆంజనేయరెడ్డి, ఎస్. శ్రీనివాస్ లను ప్రకటించారు. ప్రధాన కార్యదర్శులుగా మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యానారయణ రాజు, మధుకర్ ఎల్ గాంధీలు నియమితులయ్యారు.