Voter ID కోసం ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ తంటాలు!

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కుపై వివాదం కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలోని స్వస్థలమైన దుగ్గిరాలలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఓటు హక్కును తొలగించారు. దీనిపై గుంటూరు జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు.

ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం గుంటూరు జిల్లా దుగ్గిరాలో ఉన్న తన పూర్వీకుల ఇంటికి వెళ్లారు. తాను తిరిగి ఓటు హక్కు పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఓటును తిరిగి పొందేందుకు అధికారుల సందేహాలను తొలగించనున్నట్లు చెప్పారు. రమేష్ కుమార్ ఇటీవల దుగ్గిరాలలో ఓటరు ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన హైదరాబాద్‌లో నివసిస్తున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దరఖాస్తు తిరస్కరించారు.

ఓటర్ నివసించే స్థలం ఆధారంగా వ్యక్తికి ఓటరు ఐడీ జారీ చేస్తారు. నిమ్మగడ్డ శాశ్వత చిరునామా హైదరాబాద్‌లో ఉన్నందున, దుగ్గిరాల అధికారులు ఆయన ఓటరుగా నమోదు దరఖాస్తును తిరస్కరించారు. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రస్తుతం విజయవాడలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, పని రోజులలో మాత్రమే అక్కడ నివసిస్తున్నారని తెలిసిందే.

గుంటూరు జిల్లా కలెక్టర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని తాను ఎన్నడూ నివాసం ఉండని దుగ్గరాలలో తనకు ఓటు హక్కు హక్కును కల్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్వయంగా నిమ్మగడ్డనే విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని అంగీకరించారు. దాంతో పాటుగా ఆయన పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్‌లో ఉన్న కారణంగా ఓటరు కార్డు జారీ చేయలేదు.

ఆయన ఓటు హక్కు దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దుగ్గిరాల నుండి తనకు ఓటరు ఐడీ కోసం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని గుంటూరు జిల్లా అధికారులు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తెలియజేశారు.