ఎస్ఈసి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం

మార్చి 10 వ తేదీన రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించుకోరాదని, వారి కదలికలపై దృష్టి సారించాలని, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. వాలంటీర్లు ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ఓటర్ స్లిప్ లను కూడా వాలంటీర్ల చేత పంపిణి చేయించకూడదని ఆదేశించారు. విపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసి పేర్కొన్నారు.

అయితే, నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఎస్ఈసి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోహన్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరపబోతున్నది.