ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. వారికి రైస్ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని భావిస్తూ పది రోజుల్లోనే వీరికి కొత్త రైస్ కార్డులను మంజూరు చేసేలా చూడాలని అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ విషయంలో ముందడుగు వేసిన అధికారులు.. ట్రాన్స్‌జెండర్లను గుర్తించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. కార్డు లేని అనాథలు, ట్రాన్స్‌జెండర్లు, పిల్లలు లేని వితంతవులు, ఇల్లు లేని వారిని గుర్తించాలని అధికారులు, వాలంటీర్లకు తెలిపారు.

వారు రైస్ కార్డుల కోసం గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోనేలా చెప్పాలని వీటికి సాధారణ కార్డులాగానే ఆరు అంశాల ప్రాతిపదికన తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక కార్డు పొందిన వారు సంక్షేమ పథకాలకు అర్హులని వెల్లడించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. తమ కోసం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.