ఏపీ మునిసిపల్ పోల్స్: 7,263 నామినేషన్ల ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మంగళ, బుధవారాల్లో ఏకంగా 7,263 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లా నుంచి పెద్దమొత్తంలో నామినేషన్ల ఉపసంహరణ జరిగింది.

 ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల ఎన్నికల బరిలో 8,787 మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం నిన్ననే ప్రకటించాల్సి ఉన్నా విజయవాడ, విశాఖపట్టణం నగర పాలక సంస్థల్లో లెక్కల విషయంలో జాప్యం జరగడంతో జాబితా ప్రకటించలేకపోయారు. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఈసీ నేడు వెల్లడించే అవకాశం ఉంది.