ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ 5వ రోజు జనసేన విజయ యాత్ర

శ్రీకాళహస్తి నియోజకవర్గం: “ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్” “జనసేన విజయ యాత్ర” కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం, కైలాస గిరి కాలనీలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ.. వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరిస్తూ, పథకాల పేరిట వైసీపీ చేస్తున్న దోపిడీని ప్రజలు వివరించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం స్ట్రీట్ లైట్లు కూడా వెయ్యలేదని మహిళలు తెలిపారు. స్ట్రీట్ లైట్లు లేక రాత్రి సమయాల్లో బయట రాలేని పరిస్థితి అని, పాముల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, వీర మహిళలు, లక్ష్మి, శారద, పుష్ప, కవిత, బతెమ్మ, దేవి, సుకన్య, జయంతి, నాయకులు దినేష్, గురవయ్య, ఉదయ్, జనసైనికులు బబ్లూ, శ్రీరామ్, చిన్న మునయ్య, శబరి, వెంకీ, భాను, ఈశ్వర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.