ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 22వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, కమ్మ కొత్తూరు, అరవకొత్తూరు పంచాయతీలో శుక్రవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షులు తోట గణేష్, శారద, లక్ష్మి, రాజ్య లక్ష్, కవిత, చిరంజీవి, సురేష్, రాజేష్, మునయ్య, గురవయ్య, జనసైనికులు మురుగా, దినేష్, హేమంత్, నాగ రాజ, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.