చిరంజీవికి క్షమాపణ చెప్పాలి

పాలకొండ నియోజకవర్గం, జనసేన జానీ పత్రికాముఖంగా మాట్లాడుతూ చరిత్రలో మొదటిసారి అసలు పోటీ చెయ్యకుండా పార్టీని అమ్మేసిన రికార్డ్ షర్మిల సొంతం అని, వై.ఎస్ షర్మిలను కాంగ్రెస్ లోకి పక్కా ప్లాన్ తో పంపించింది జగనే అని, కుటుంబాలను హత్య చేసే సంప్రదాయం కలిగిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఒక అప్పుడు చిరంజీవి పి.ఆర్.పి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే జగన్ రెడ్డి టీమ్ మరియు షర్మిల అక్కతో పాటుగా ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఛానెల్స్ పేపర్స్ తో సహా ప్రజారాజ్యం పార్టీ జెండా పీకేశారు చిరంజీవి ప్యాకేజీకి అమ్ముడు పోయారు అన్న నోళ్లు ఈరోజు షర్మిల విషయంలో ఎందుకు మూగబోయాయి? ఇది వివక్ష కాదా? వైఎస్సార్టిపిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల రాజన్న బిడ్డ రాజన్న కూతురి పార్టీ విలీనం సంపూర్ణం. దిగ్విజయంగా జరిగిన జెండా పీకేసిన సందర్బంగా నేను ఆంధ్రప్రదేశ్ లో కొంతమందికి సూటిగా అడుగుతున్నాను. నాడు చిరంజీవి చేసింది తప్పు అయితే నేడు షర్మిల చేసింది కూడా తప్పే నాడు చిరంజీవి కరెక్ట్ అయితే నేడు షర్మిల కూడా కరెక్టే కనుక ఒకప్పుడు చిరంజీవిని అనరాని మాటలు అన్నందుకు షర్మిల & పేటియం బ్యాచ్ చిరంజీవికి క్షమాపణ చెప్పాలని అన్నారు.