పీలేరు నియోజకవర్గ మండలస్థాయి జనసేన కమిటీల నియామకం

పీలేరు, పీలేరు టౌన్ నందు పీలేరు నియోజకవర్గ మండల స్థాయి జనసేన కమిటీల నియామకం మరియు సమావేశం జరిగింది. చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లా కార్యదర్శి కలప రవి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ఆర్కె బాటసారి, మండల ఇన్చార్జ్ లు వి మోహన్, యం కిషోర్, టి మహేష్ కుమార్ అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం పీలేరు ఇన్చార్జ్ బెజవాడ దినేష్ పర్యవేక్షణలో ముఖరంచాంద్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు పిలవగానే వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.