విజయవాడ నగర డివిజన్లకు జనసేన అధ్యక్షుల నియామకం

విజయవాడ నగర పరిధిలోని మున్సిపల్ డివిజన్లకు అధ్యక్షుల నియామకానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. విజయవాడ నగరంలోని పశ్చిమ, సెంట్రల్, తూర్పు అసెంబ్లీ స్థానాలలో ఉన్న ఈ డివిజన్లకు పార్టీ తరఫున అద్యకుల నియామకం కోసం గత కొన్ని రోజులుగా కార్యకర్తలతో విస్తృత సమావేశాలను నగరంలోని జనసేన ముఖ్య నాయకులు నిర్వహించారు. వారు సంయుక్తంగా రూపొందించిన ప్రతిపాదనలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదించారు. విజయవాడ నగర ప్రజలకు అన్ని వేళలా డివిజన్ అధ్యక్షులు అండగా ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.