కాపు సంక్షేమ సేన కమిటీ నియామకం

పీలేరు: కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగుండి హరి రామ జోగయ్య ఆదేశాల మేరకు కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షులు పోటుకూరి ఆనంద్ అధ్యక్షతన పీలేరు నియోజకవర్గ అండే సురేష్ బాబుని అధ్యక్షులుగా నియమించడం జరిగినది. పీకిలేరు మండల అధ్యక్షులుగా ఎం సుబ్బు గారిని నియమించడం జరిగింది. కలికిరి మండల అధ్యక్షులుగా కె మహేష్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇందులో కాపు సంక్షేమ సేన రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కలప రవి, కాపు సంక్షేమ యువసేన తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గోపి, డి నవీన్, బి రామ్మూర్తి, మల్లికార్జున, రామంజులు పాల్గొన్నారు.