జంగారెడ్డిగూడెంలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలకు జనసేన మద్దతు

జంగారెడ్డిగూడెం నియోజకవర్గం: జంగారెడ్డిగూడెంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద న్యాయవాదులు చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు, చింతలపూడి నియోజకవర్గం ఇంచార్జి మేకా ఈశ్వరయ్య దీక్షలో పాల్గొని జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు భువనేశ్వరికి, రామ్మోహన్ కు సహచర న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షాలా మారిందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి అనువుగా ఉండే జీవోలను తెచ్చుకుని న్యాయవ్యవస్థకు కుంటుపడేలా వ్యవహరిస్తున్నారని జీవోని వెంటనే రద్దు చేయాలని లేదంటే ముందు ముందు పరిణామాలు క్లిష్టంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగ కృష్ణ గారు ఏడు మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.