అరకు నియోజకవర్గం ముఖ్య నేతల సమావేశం

అరకు, అత్యంత సమీప భవిష్యత్తులో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరకు జనసేన నేతలు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల మరియు పంచాయతీ స్థాయి కమిటీలను పూర్తి చేసి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశంతో పాటు పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయు నిమిత్తం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ చెట్టి చిరంజీవితో పాటు జిల్లా కార్యదర్శి ముల్లంగి శ్రీనివాసరావు మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావు, నియోజకవర్గ మండల నాయకులు బలిజ కోటిపడాల్, రామకృష్ణ, దనేశ్వరరావు, ప్రసాద్, చిన్నారావులు పాల్గొన్నారు.