స్వచ్ఛందంగా రోడ్లు వేసుకున్న అరవపాలెం జనసైనికులు

రాజోలు మండలం అరవపాలెం గ్రామంలో స్వచ్ఛందంగా రోడ్లు వేసుకున్న గ్రామస్తులు మరియు జనసైనికులు. అరవపాలెం నుండి చింతలపల్లి రోడ్డు అధ్వానంగా మారడంతో సొంత ఖర్చులతో చందాలు వేసుకుని రోడ్లు చదును చేసి రోడ్డు వేసుకోవటం జరిగింది. గత కొన్నేళ్లుగా అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో స్వయంగా రంగంలోకి దిగి జనసైనికులు, గ్రామస్తులు మరియు రైతులు కలిసి రోడ్డు వేసుకోవటం జరిగింది. వేల ఎకరాల్లో పంట పండించే రైతుల రోడ్లు అధ్వానంగా ఉండడంతో మండిపడ్డ గ్రామస్తులు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో జనసైనికులును ఆశ్రయించి వారితో కలిసి రోడ్డు వేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వులిశెట్టి లక్ష్మణరావు, సూరిశెట్టి శ్రీను, ముత్యాల సత్తిబాబు పాల్గొన్నారు.