జగన్ సిద్దమా? యుద్దానికి

  • ఎన్నికలకు ముందు ముద్దులు.. గద్దెనెక్కాక గుద్దులు
  • జగన్ సిద్దంగా ఉండు ఓడిపోవడానికి
  • టిడిపి రా.. కదలిరా సభలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసులేటి హరిప్రసాద్

పీలేరు: జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్దమంటూ హోర్డింగ్ లు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. శనివారం పీలేరులో జరిగిన టిడిపి “రా.. కదిలిరా” కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గెలిపించాలనే జనసేన, టిడిపి కలిశాయన్నారు‌. కలయిక రెండు పార్టీల కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసమన్నారు. అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులు నింపడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నడుం బిగించారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ పోరాడారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఆశయం, అభివృద్ది కలిగిన పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందుతుందన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ల్యాండ్, శ్యాండ్, బ్రాండ్ ల పేరు చెప్పి దోచుకుంటున్నారని తెలిపారు. తల్లిని, చెల్లిని చూడని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడని ఎద్దేవా చేశారు. జగన్ వదిలిన బాణం ఆయన్నే ఎక్కుపెట్టిందని చలోక్తులు విసిరారు.