వీరన్నబాబు సంబరం సందర్భంగా అన్నప్రసాదాల ఏర్పాటు

అమలాపురం: సోమవారం ఉప్పలగుప్తం మండలం ఆకుల వారి వీరన్నబాబు సంబరం సందర్భంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ మిగిలిన 350 పొట్లాల అన్న ప్రసాదములు ఆదివారం మేము పెట్టిన పోస్ట్ ఈనాడు, ఆంధ్రప్రభ, నాగ శ్రీనివాసరావు గ్రూప్లో, విఐపి న్యూస్ పేపర్లో చూసి ఉప్పలగుప్తం మండలం జనసేన పార్టీ నాయకుడు ఆకుల సూర్యనారాయణ మూర్తి, మోటూరి గోపాల కృష్ణ, చిక్కం సీతారామ ప్రసాద్ ఆకుల కృష్ణ, మురళి అలాగే అమలాపురం పట్టణంలో వనచర్ల వారి వీధిలో రజస్వల శుభకార్యం ముగిసిన తర్వాత మిగిలిపోయిన 150 పొట్లాల ఆహార పదార్థాలను అలాగే అమలాపురం మండలం వేమవరం గ్రామం లింగోలు వారి వీరన్న బాబు సంబరం సందర్భంగా మిగిలిన అన్న ప్రసాదము లను 40 పొట్లాలు వాళ్లు కూడా మాకు ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది. వాటిని మేము వాళ్ళ సమక్షంలో ప్యాకింగ్ చేసి అమలాపురం పట్టణం బస్ స్టాండ్ ఆవరణలో ఆశానగర్, ఉప్పర కాలనీ, ఈదరపల్లి కాలవ గట్టు, గుడిసెల వద్ద ఆకలితో ఉన్న వాళ్లకి వృద్ధులకు, అనాధలకు, దివ్యాంగులకు ఆ పొట్లాలను పంచిపెట్టడం జరిగింది.