బసవ నూకరాజు కుటుంబానికి ఐదు లక్షల బీమా చెక్కు అందజేత

  • ఇటీవల విద్యుత్ షాక్ ప్రమాదంలో మరణించిన నూకరాజు
  • కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్న జనసేన

పిఠాపురం మండలం: మొదట నుండి మెగా ఫ్యామిలీకి అభిమానిగా ఉంటూ, జనసేన పార్టీ అభివృద్ధికి కృషిచేసిన చిత్రాడ జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త బస్వా నూకరాజు కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును జనసేన నాయకులు అందించారు. ఇటీవల విద్యుత్ షాక్ ప్రమాదంలో మరణించిన బసవ నూకరాజు క్రియాశీల సభ్యత్వం కలిగి ఉన్నందున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మరణించిన కార్యకర్త నూకరాజు కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కుని జిల్లా అధ్యక్షులకు పంపించి, నూకరాజు కుటుంబ సభ్యులకు అందజేయవలసినదిగా సూచించారు. ఈ మేరకు  సోమవారం కార్యకర్త నూకరాజు  నివాసానికి వెళ్ళి, నివాళి అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి, పిఎసి సభ్యులు, కీ.శే. బసవా నూకరాజు కు సభ్యత్వం చేయించిన క్రియాశీలక వాలంటీర్ పెంకే జగదీష్ చేతుల మీదుగా 5 లక్షల రూపాయల బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుర్గేష్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ ఎవరైనా పార్టీ కార్యకర్తలు గాయపడినా, దురదృష్టవశాత్తు మరణించినా వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ముందు చూపుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి బీమా చేయించారని అన్నారు. ఈ కుటుంబానికి అన్ని విధాలుగా జనసేన పార్టీ ఇన్చార్జిలు, నాయకులు, జనసైనికులు అండగా ఉండాలని తెలియజేశారు. అనంతరం పిఠాపురం జనసేన ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ చేయని ఒక గొప్ప కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు మొదలుపెట్టి, ప్రమాదం జరిగిన సమయంలో వైద్య ఖర్చులకు, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఉపయోగపడేలా భీమ పథకానికి తీసుకొచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తకు ఒక అన్నయ్యలా భరోసాని కల్పిస్తూ ఆ కుటుంబాలకు అండగా ఉంటున్నారని, ఇది నూకరాజు గారి పిల్లల పట్ల నిదర్శనమని అన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మా నాన్న ప్రమాదంలో మరణించిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని గతంలో జనసేన పార్టీ నాయకులు పెంకే జగదీష్ ద్వారా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న మాకు ఐదు లక్షల రూపాయల బీమా కుటుంబ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుందని, పవన్ కళ్యాణ్ ఒక అన్నలాగా, కందులు దుర్గేష్ గారు, ఇంచార్జ్ శేషు కుమారి గారు మాకు చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఇదే గ్రామంలో ఉన్న రాజులమ్మకు ఇటీవల ఇంచార్జ్ శేషు కుమారి హస్బెండ్ డా. మాకినీడి వీరప్రసాద్ ద్వారా బోదకాలుకు పెద్ద ఆపరేషన్లు మూడు చేయించి ఆమెను ఇంటికి క్షేమంగా తీసుకురావడం జరిగింది. నేడు ఆమె నడవగలుగుతున్నదంటే జనసేనే కారణం, ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, ఆవిడకి అన్ని విధాలుగా జనసేన పార్టీ సపోర్ట్ ఉంటుందని జిల్లా అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసి సభ్యులు పంతం నానాజీ, మూత్తా శశిధర్, పితాని బాలకృష్ణ ఇన్చార్జులు శెట్టిబత్తుల రాజబాబు, మేడ గురుదత్త ప్రసాద్, మర్రెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ, ప్రాంతీయ వీరమహిళా రీజనల్ కన్వీనర్లుచల్లా లక్ష్మి, ముత్యాల జయ, కడలి ఈశ్వరి, అధికార ప్రతినిధి తోలేటి శిరీష, ఉపాధ్యక్షురాలు సిరిగినీడి వెంకటేశ్వరరావు, సుంకర కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శితలాటం సత్య, మొగలి అప్పారావు, మండల ప్రెసిడెంట్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు, లోకల్ పిఠాపురం జనసేన నాయకులు తెలగశెట్టి వెంకటేశ్వరరావు, వూట ఆది విష్ణు, వెన్న జగదీష్, కంబాలదాసు, డా. పిల్లా శ్రీధర్, గోపు సురేష్, అమరాది వల్లి రామకృష్ణ, కడారి తమ్మయ్య నాయుడు, హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్మన్ బొంగరాల రవి చంద్రన్, చెల్లుబోయిన సతీష్, ఎంపీటీసీ దూలపల్లి రత్నం, శిగటాపు నారాయణరావు, బావిశెట్టి నంది, దేశిరెడ్డి సతీష్, బస్వా గోపి, నంద్యాల జాన్, నిమ్మన దుర్గ, తెలు దొరబాబు, పల్నాటి మధు, కోటపల్లి గోపి, అమ్మాజి శిరీష, గౌరీ నాగలక్ష్మి, కుమారి, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.