కౌలు రైతు రైతు అయిన నాకు న్యాయం చేయాలి: అవుకు ఏసు

సిరివెళ్ళ మండలం, వెంకటేశ్వర పురం గ్రామానికి చెందిన కౌలు రైతు అవుకు ఏసు తనకు న్యాయం జరగాలి అంటూ.. అమరణన నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.

ఈ సంద్భంగా బాధితుడు మాట్లాడుతూ అవుకు ఏసు అనే నేను 16-06-2022 వ తేదీ నుండి ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న నేను 18 ఎకరముల భూమిని కౌలుకు తీసుకుని వరీ పంట వేయడం జరిగింది. ఏనిమిది ఎకరములకు గాను కౌలు అన్ని పోయి 399 బస్తాలు ధాన్యం మిగలగా అదే గ్రామానికి చెందిన రాయ వెంకటేశ్వర్ రెడ్డి మంచి ధర వచ్చిన తరువాత అమ్ముకుందాం నీ వడ్లు అన్నిటినీ గంగుల వేర్ హౌస్ గౌడౌన్ కి తోలు అనడంతో అవుకు ఏసు అతని పైన నమ్మకంతో నా ట్రాక్టర్లో 399 బస్తాల (వడ్లు)ధాన్యం వేసుకొని గంగుల వేర్ హౌస్ గౌడౌన్ కి తరలించడం జరిగింది. అయితే రాయ వెంకటేశ్వర్ రెడ్డి నాకు తెలియకుండా 399 బస్తాల వడ్లు అమ్ముకోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న నాకు తెలియకుండ ఎందుకు అమ్మినావు?.. నాకు రావాల్సిన 7లక్షల రూపాయలు నాకు ఇవ్వమని అడగగా.. అప్పుడు ఇస్తాను.. ఇప్పుడు ఇస్తాను అంటూ.. ఒకరోజు రాయ వెంకటేశ్వర్ రెడ్డి ఇంటిదగ్గరకు పిలిచి అతని కుమారుడు నన్ను ఏరా మాల నాకొడకా.. నన్ను డబ్బులు అడుగుతావా అంటూ నన్ను, నా భార్యను, కుమార్తెలను కొట్టి ఇంకా నువ్వే నాకు 3లక్షల రూపాయలు అప్పు ఉన్నావు అని.. ఖాళీ ప్రామిసరి నోట్ల పై సంతకం చేపించికొవడం జరిగింది. జరిగిన విషయం అంతా.. శిరివెళ్ళ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇవ్వడానికి పోయిన నన్ను, నా కూతురును పోలీస్ స్టేషన్ నుండి బయటికి తోసి వేసి.. నా ఫిర్యాదును చించివేసి.. రాయ వెంకటేశ్వర రెడ్డిని అతని కుమారున్ని చట్టపరమైన శిక్షల నుండి రక్షించి.. నేను ఏ మాత్రం బాకీ లేనప్పటికి నాకు తెలియని 10 మందిని పోలీస్ స్టేషనుకు పిలిపించి.. వారికి నేను బాకీ ఉన్నట్లు, నా బాకీలను రాయ వెంకటేశ్వర రెడ్డి కట్టినట్లు, మిగిలిన రు .3,00,000 / -ల కోసమే రాయ వెంకటేశ్వర రెడ్డి, అతని కుమారుడు నా చేత 3 ఖాళీ ప్రామిసరీ నోట్లలో సంతకాలు చేయించుకున్నట్లుగా సిరివెళ్ల పోలీస్టేషన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి చిత్రీకరించాడు. శిరివెళ్ల పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు అని కర్నూల్ జిల్లా ఎస్పీ కి, నంద్యాల జిల్లా ఎస్పీ కి తెలియజేయగా.. వారు ఇరువురు చంద్ర బాబు నాయుడు గారికి రిఫర్ చేయడం జరిగింది. మరలా సీఐ కి కేసును రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తరువాత సిరివెళ్ల ఎస్ఐ ఫోన్ చేసి కంప్లెయింట్ తీసుకొని రా కేసు పెడతా అని చెప్పగా.. జరిగిన విషయం కంప్లెయింట్ రాసుకొని తీసుకుని వెళ్లగా.. ఆ కంప్లయింట్ పేపర్ చూసి లంజకొడకా.. ఎవడురా నిన్ను ఇలా వ్రాయమంది.. లేబర్ నాయాల అంటూ.. నేను వ్రాసి ఇచ్చిన కంప్లయింట్ పేపర్ చింపివేసి ఎవడికి చెప్పుతావో చెప్పుకో.. నన్ను ఏం పీకలేవ్.. రాయ వెంకటేశ్వర్ రెడ్డి నుంచి ఒక్క రూపాయి కూడా రాదు.. చేసుకుంటావో చేసుకో అంటూ.. నన్ను అవమాన పరచిన వారిని శిక్షించాలి అని కోరుతున్నాను.

డిమాండ్స్:-
1)గంగుల వేర్ హౌస్ గౌడౌన్ లో ఉన్న నాకు సంబంధించిన 399 బస్తాల వడ్లను నాకు తెలియకుండా అమ్ముకుని నాకు డబ్బులు ఇవ్వకుండా నన్ను ఇంటికి పిలిపించుకొని నన్ను, నా కుమార్తెను చంపుతాను అని బెదిరించి నా చేత 3 ఖాళీ ప్రామిసరీ నోట్లలో బలవంతంగా సంతకాలు చేయించుకున్న రాయ వెంకటేశ్వర్ రెడ్డి పైన, అతని కుమారుని పైన చట్ట ప్రకారము కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్టు చేయాలి.
2)రాయ వెంకటేశ్వర్ రెడ్డి పైన.. అతని కుమారుని పైన ఫిర్యాదు చేయుటకు పోయిన నన్ను, నా కూతురును పోలీస్ స్టేషన్ నుండి బయటికి తోసి వేసి నా ఫిర్యాదును చించివేసి రాయ వెంకటేశ్వర రెడ్డిని అతని కుమారున్ని చట్టపరమైన శిక్షల నుండి రక్షించి.. నేను ఏ మాత్రం బాకీ లేనప్పటికి నాకు తెలియని 10 మందిని పోలీస్ స్టేషనుకు పిలిపించి వారికి నేను బాకీ ఉన్నట్లు, నా బాకీలను రాయ వెంకటేశ్వర రెడ్డి కట్టినట్లు, మిగిలిన రు .3,00,000 / -ల కోసమే రాయ వెంకటేశ్వర రెడ్డి అతని కుమారుడు నా చేత 3 ఖాళీ ప్రామిసరీ నోట్లలో సంతకాలు చేయించుకున్నట్లుగా అబద్ధాలు చెబుతున్నసిరివెళ్ల పోలీస్టేషన్ ఎస్ఐ గారి పైన చట్ట ప్రకారము కేసు రిజిస్టర్ చేసి ఆయనను అరెస్టు చేయాలి.
3). సిరివెళ్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి వలన ఆయన స్నేహితుడు భాగస్వామి అయిన రాయ వెంకటేశ్వర రెడ్డి వలన అతని కుమారుని వలన వారికి పరిచయస్తులైన దౌర్జన్యకారులవలన, కిరాయి రౌడీలు వలన నాకు, నా కుటుంబమునకు ఏ విధమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలి.