స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్రపతి ప్రసంగంలో భాగంగా

దేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రసంగంలో భాగంగా ప్రస్తుత పరిస్తితులకు స్పందిస్తూ…

దేశ ప్రజలు కరోనా కట్టడికి చాలా బాగా సహకరించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో దేశ ప్రజల సహకారం అమోఘమని కొనియాడారు. కరోనా కారణంగా ఈ ఏడాది మునుపటిలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మునుపటిలాజరుపుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నిర్ణయాలు అభినందనీయం:

కరోనా సంక్షోభం నేపథ్యంలో పలు రంగాల్లో దేశం స్వయం సంవృద్ధి సాధించేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి అభినందించారు.

అయోధ్య రాముని గురించి రామ్ నాథ్ కోవింద్:

రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన ప్రసంగంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని కూడా ప్రస్తావించారు. 10 రోజుల క్రితం అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిందని, దీని పట్ల యావత్ దేశం గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.