అశేష జనవాహిని సమక్షంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు

అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించిన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చికలం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి భవాని రవి కుమార్, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వర్, కదిరి నియోజక వర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్, రాయలసీమ ప్రాంతీయ మహిళ అద్యక్షురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత, మదనపల్లి ఇంచార్జీ రామ్ దాస్ చౌదరి, చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీమతి దారం అనిత, నాయకులు పెండ్యాల హరి, రాష్ట్ర చేనేత కార్యదర్శి అడపా సురేంద్ర మరియు అతిరథ మహారథులు అధినేత పుట్టిన రోజు వేడుకలలో పాల్గొని జనసేన పార్టీ బలోపేతం కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం మనం అంతా కృషి చెయ్యాలని.. యువకులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని సమాజంలో అవినీతి, దౌర్జన్యం రాజ్యం ఎలుతోందని వాటిని నిర్మూలించాలి అంటే మనం అంతా జనసేన పార్టీని గెలిపించుకునేందుకు కృషి చేయాలని “నా సేన నా వంతు ” అనే కార్యక్రమం ద్వారా ప్రజలే నేరుగా పార్టీ బలోపేతం కోసం విరాళాలు ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చెయ్యాలని.. అలా కానీ పక్షంలో స్థానిక నాయకుల దృష్టికి తీసుకొని వస్తె మేమంతా మీకు సహకారం అందిస్తూ ఆ సమస్యపై పోరుకు సిద్దం అని తెలియజేశారు.
రాబోయే రోజుల్లో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం లక్ష్య సాధన కోసం మనం ఒక సైనికుల మాదిరి పని చేసి ఇదే రాయలసీమ ప్రాంతం నుంచి గెలుపును పవన్ కళ్యాణ్ గారికి బహుమతి రూపంలో అందిద్దాం అని రాబోయే ఎన్నికల్లో అధికార మదంతో కొట్టుకుంటున్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పడానికి ప్రతి నియోజక వర్గంలో సిద్దంగా ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలను, వీర మహిళలను, నాయకులను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.


ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, మెగాఅభిమానులు సురక్షితంగా ఇంటికి చేరాలని ఆకాంక్షించారు.

అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించిన సాహి సురేష్, డేగల మహేష్, మండల నాయకులకు మొదటి నుంచి ఈ కార్యక్రమం కోసం కష్టపడుతున్న మండల కన్వీనర్ కే.వి. రమణ, నాయకులకు, జనసైనికులకు, రాయలసీమ ఏకైన ఎంపీటీసీ అమర్, ఈ కార్యక్రమం కోసం స్థలాన్ని కేటాయించిన కుమార్, ఈ వేడుకలు విజయవంతం అవ్వడం కోసం కృషి చేసిన కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు ఫయాజ్ మరియు మీడియా మిత్రులకు, అధికారులకు, తనకల్లు మండల ప్రజలకు, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *