అశోక్ గజపతిరాజుకు హైకోర్టు లో ఊరట..

ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన తర్వాత ధర్మకర్తల మండలి నుంచి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు… ధర్మకర్తల మండలి నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు అనంతరం అశోక్ గజపతిరాజు స్పందించారు. వారసత్వ ధర్మకర్తగా తనను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసిందని వెల్లడించారు. ఇవాళ రామతీర్థంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా రాముడే తనను సేవించుకునేలా భాగ్యం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు.