ఆసియా-భారత్‌ శిఖరాగ్ర సదస్సు: వర్చువల్‌గా హాజరుకానున్న ప్రధాని మోడీ

ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే 16వ తూర్పు ఆసియా సమ్మిట్‌తో పాటు 18వ ఆసియా-భారత్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. బ్రూనై సుల్తాన్‌ ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ ఏషియన్‌-భారత్‌ సమ్మిట్‌కు ఆసియా దేశాధినేతలు లేదా ప్రభుత్వాలు హాజరవుతాయి. ఈ సమావేశంలో ఏషియన్‌-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య స్థితిపై సమీక్ష చేపడతారు. అదేవిధంగా కోవిడ్‌-19, ఆరోగ్యం, వాణిజ్యం, వ్యాపారం, అనుసంధానం, విద్య, సంస్కృతితో సహా కీలక రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా అనంతర ఆర్థిక పురోగతితో సహా ముఖ్యమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను చర్చిస్తారని పేర్కొంది. ఏటా జరిగే శిఖరాగ్ర సదుస్సు ద్వారా భారత్‌కు అవకాశాలు వస్తాయి. గత ఏడాది నవంబర్‌లో జరిగిన 17వ ఆసియా-భారత్‌ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరయ్యారని, ఈ ఏడాది కూడా పాల్గంటే.. తొమ్మిదవ సదస్సు ఇది అవుతుందని వెల్లడించింది.