“ఆశ కంటే ఆశయం గొప్పది”

మన మూలాలను ఎపుడూ మర్చిపోకూడదు. జీవిస్తున్న కొద్దీ ఎటువైపు వెళ్తున్నామన్నది ముఖ్యం. ఈ ప్రయాణం ఎక్కడ నుంచి మొదలెట్టామో గుర్తుంచుకోవడం ఇంకా ముఖ్యం. అప్పుడే ముందు మనం అనుకున్న దారిలోనే వెళ్తున్నామా? ఎక్కడైనా పక్కదారి పట్టామా అన్నది తెలుస్తుంది. ఎప్పుడూ ఇవి మన మనసులో ఉంటే, ఏ పరధ్యానం లోనోఎప్పుడైనా పక్కదారి పట్టినా వెంటనే సరిచేసుకోవచ్చు. ఒక్కోసారి సగం జీవిత ప్రయాణం బాగానే చేసి తర్వాతైనా దారి తప్పవచ్చు. అందుకే అప్రమత్తత అనుక్షణం అవసరం. ఒకవేళ చివరి వరకు అనుకున్న మార్గంలోనే జీవిత ప్రయాణం జరుగుతున్నా, దారి పొడవునా ఎదురైన అనుభవాలెన్నో ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోవటం కూడా అంతే అవసరం. ఆ అనుభవాల్లో అన్నీ ఇప్పుడేమీ పనికిరాకపోవచ్చు. కానీ, అందులో కొన్నైనా పనికొచ్చినా మంచిదేగా… కాకపోతే, అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా, ఏదో కారణం చేత జీవితం కొన్ని మలుపులు తిరిగి ఉండవచ్చు. ఈ ఊహించని మలుపులే ఏవో కొత్త పాఠాలు నేర్పివుంటాయి..ఆ అనుభవాల్ని మరోసారి గుర్తుచేసుకోవడం వల్ల, మధురానుభూతుల్నే కాదు ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాల్నీ, గాయాల్నీ గుర్తుచేసుకోనే అవకాశం ఉంది. అప్పుడుపడ్డ ఘర్షణను గుర్తుచేసుకున్నట్లు అవుతుంది. దాని ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని గుర్తుచేసుకున్నట్లవుతుంది. ఒకనాటి మట్టిగొడల ఇల్లు నుచి డాబా వరకూ, పలక నుంచి ల్యాప్ టాప్ దాకా, నాటకాల నుంచి సినిమాల వరకు, కాలికి చెప్పుల్లేకుండా వెళ్లిన స్కూల్ రోజుల్నుంచి ఆఫీస్ కి షూతో వెళ్లిన రోజువరకూ వచ్చిన ఈ ప్రయాణం ఎంతో సుదీర్ఘమైనది. ఇవి నేర్పిన పాఠాలు చాలా ఎక్కువే ఎన్నో ఆవిష్కరణల ప్రయాణం వెనక ఎంతో ఆరాటం ఉంటుంది. పోరాటం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎంత చెమట చిందించామో, ఎంత రక్తం ధారపోసామో, ఎన్ని త్యాగాలు చేశామో తెలుసుకోవద్దా? అందుకే ఇప్పుడున్న పరిస్థితే సమస్తం అని అనుకోకుండా, గత చరిత్రను కూడా చూడాలి. అందరం కలలు కనే అధ్బుతమైన భవిష్యత్తు తాలూకు మూలాలెన్నో ఆ గతంలో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే..పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఇన్ని లక్షల మంది మద్దతుగా నిలబడ్డారంటే మూల కారణం ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రయాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలే కారణం. ఈ కారణంగానే మనం చేయలేని పనిని ఆయన చేస్తున్నారని ఆయన ద్వారానే సమన్యాయం లభిస్తుందని నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం. ఇదే మన ఆశయం. అందరి మూల సిద్ధాంతం ఇదే కదా! మరి మన ఆశయం బలమైనదే అయితే మధ్యలో రకరకాల ఆశల వల్ల మన ఆశయం బలహీనపడుతుంది కదా!! ఆశయం పక్కదారి పడుతుంది. అందుకే ఆశ కంటే ఆశయం గొప్పదై ఉండాలి అంటారు.

➡️ గోపాలకృష్ణ,
రాజేంద్రనగర్ నియోజకవర్గం.